గిరిజన యువత కోసం  ఫేస్‌బుక్ ఇండియా డిజిటల్ ట్రైనింగ్

గిరిజన యువత కోసం ఫేస్‌బుక్ ఇండియా డిజిటల్ ట్రైనింగ్

హైదరాబాద్: గిరిజన యువత కోసం కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, ఫేస్‌బుక్ ఇండియా ఆధ్వర్యంలో డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. గోయింగ్ ఆన్‌లైన్ యాజ్ లీడర్స్ పేరిట నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమానికి 18-35 ఏళ్ల మధ్య వయసున్న యువత హాజరు కావొచ్చని పేర్కొంది. వ్యాపారం, విద్య, ఆరోగ్యం, రాజకీయం, కళ, పరిశోధన, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో 9నెలల replicas de relojes españa పాటు శిక్షణ ఇస్తుందని, అనంతరం సర్టిఫికెట్ జారీ చేస్తామని వెల్లడించింది. మంచి ప్రతిభ కనబర్చిన వారికి ప్రఖ్యాత సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తుందని వివరించింది. ఆసక్తి గల యువత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెల్లడించింది.

 

c
Become a Owner