దళితుల భూముల్లో వైకుంఠ ధామం నిర్మాణం అన్యాయం..

దళితుల భూముల్లో వైకుంఠ ధామం నిర్మాణం అన్యాయం..

తెలంగాణ సి.యం కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటి మీది మూటలుగా మారిపోయాయి. దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూపంపిణీ జాడేలేకుండా పోయింది. దళితులకు భూములు ఇవ్వకున్న పర్వాలేదు కానీ అభివృద్ధి నిర్మాణాల పేరుతో తమ వ్యవసాయ సాగు భూముల్లో వైకుంఠ దామాలు, డంప్ యార్డుల నిర్మాణాలు చేపడుతుందడడంతో బాధితులు దిక్కు తోచక కన్నీటి పర్యంతమవుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి చేపట్ట సీఎం కేసీఆర్ ఆదేశం ప్రకారం రాష్ట్రంలో భూ ప్రక్షాళనను తెరపైకి తెచ్చారు. అనంతరం తెలంగాణ రాజముద్రతో ఉన్న పట్టా పాస్ బుక్కులను సాగులో ఉన్న సాగుదారులకు అందించడమే కాకుండా పట్టా ఉన్న ప్రతి రైతుకు రైతుబందు, రైతు భీమాను అందిస్తున్నారు. కానీ ప్రభుత్వం దళితుల పట్ల, దళితుల భూములపై కక్షసాధింపు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి. 

 తాజాగా సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలం కెరూర్ గ్రామంలోని దళితుల భూమిని పల్లె ప్రగతి పేరుతో గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం అంటూ దళితుల పంటపొలాల్లో వైకుంఠ దామం, డంప్ యార్డు నిర్మించడం అక్రమం అంటూ బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అండదండలతో లోకల్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూ దాడులు చేస్తున్నారంటూ బాధితులు వాపోయారు. తాతముత్తతల నుండి సంక్రమించిన భూముల్లోకి మమ్మల్ని అడుగుపెట్టనియ్యకుండా...అక్రమ కేసులు పెడుతున్నారని దళితులు బోరుమన్నారు. మాకు న్యాయం చెయ్యండి అంటూ జిల్లా అధికారులకు మొరపెట్టుకున్న ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు. చివరకు దళిత మహిళలు జరిగిన విషయంపై హైకోర్టులో పిటిషన్ వేయటంతో... వైకుంఠ దామం, డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. 

c
Become a Owner