స్నేహటీవీ ప్రసారాలకు విశేష స్పందన.. ' రాజగృహ'కు సెక్యూరిటీ ఏర్పాటు చేసిన మరఠ్వాడ ప్రభుత్వం

స్నేహటీవీ ప్రసారాలకు విశేష స్పందన.. ' రాజగృహ'కు సెక్యూరిటీ ఏర్పాటు చేసిన మరఠ్వాడ ప్రభుత్వం

గత మూడు రోజుల క్రితం గుర్తుతెలియని దుండగులు  అంబేడ్కర్ రాజగృహపై దాడిచేసి పూలమొక్కలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై చర్చల ద్వారా విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసేలా స్నేహాటీవి ఛానల్ ప్రసారం చేసింది. రాజగృహకు రక్షణ కల్పిస్తూ నిందితులను శిక్షించాలనే అంబేడ్కరిస్టుల డిమాండ్లను దేశానికి సైతం వినిపించింది.

అదే సమయంలో డా.బీఆర్ అంబేడ్కర్ కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా పలు దళిత సంఘాల నాయకులు పలుచోట్ల ఆందోళనలు,నిరసనలు చేపట్టారు. మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ దీనిపై స్పందించారు.చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ట్వీట్ చేసారు.ఇదే అంశంపై   ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో కేంద్రమంత్రులు రామ్ విలాస్ పాశ్వాన్,రామ్ దాస్ అథవాలేలతో మాట్లాడారు.దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని,తక్షణమే రాజగృహకు రక్షణ కల్పిస్తూ నిందితులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

కాగా అంబేడ్కర్ మనువడు ప్రకాశ్ అంబేడ్కర్ స్పందిస్తూ రాజగృహ వద్దకు అంబేడ్కరిస్టులు గుంపులుగా వచ్చి అక్కడి శాంతియుత వాతావరణానికి  భంగం కల్పించరాదని  సూచించారు. దీంతో ఎట్టకేలకు ముంబైలోని అంబేడ్కర్ రాజగృహకు ప్రభుత్వం రక్షణ కల్పించింది.

c
Become a Owner