ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటీవ్

ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటీవ్

హైదరాబాద్‌: ప్రాణాంతక కరోనా రాజకీయ నాయకులనూ వదలడంలేదు. తెలంగాణలో  కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా బారిన పడుతున్న వారిలో రాజకీయ నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. హోంమంత్రి మహమూద్‌ అలీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.
అయితే హోంమంత్రి కరోనా నుండి కోలుకుని సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. తాజాగా మరో టీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కరోనా బారినపడ్డారు. ఇటీవల ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో cinturon louis vuitton falso వైద్యం నిమిత్తం హైదరాబాద్‌ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

ఈ క్రమంలో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, పాజిటీవ్‌గా తేలినట్లు శుక్రవారం వైద్యులు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే సునీత అక్కడే చికిత్స పొందుతున్నారు. కాగా,  కరోనా బారిన పడుతున్న రాజకీయ నాయకుల్లో ఎక్కువగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులే కావడం విశేషం. 

 

c
Become a Owner