మళ్లీ  వాయిదా పడిన ఇళ్ల పట్టాల పంపిణీ...

మళ్లీ వాయిదా పడిన ఇళ్ల పట్టాల పంపిణీ...

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 8న తలపెట్టిన పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. YSR జయంతి రోజు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కానీ కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసే రోజును ఇవాళ ప్రభుత్వం ప్రకటించనుంది. ఆగస్టు 15న ఆ కార్యక్రమం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పదేపదే ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాపడుతుండటంతో లబ్దిదారలు నిరాశపడిపోతున్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు గత మూడు వారాలనుండి అధికమౌతుండటంతో ఆగస్టు 15 నాటికి వాయిదా వేసినట్లు అధికారిక సమాచారం.

fake IWC

Become a Owner