అంబేడ్కర్ నివాసం ఉన్న 'రాజగృహ'పై దుండగులు దాడి... ఖండించిన అంబేడ్కరిస్టులు

అంబేడ్కర్ నివాసం ఉన్న 'రాజగృహ'పై దుండగులు దాడి... ఖండించిన అంబేడ్కరిస్టులు

ఆర్థిక రాజధాని ముంబైలోని రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేద్కర్‌ నివాసం ఉన్న ‘రాజగృహ’పై ఇద్దరు దుండగులు దాడిచేశారు. దాదర్‌లో ఉన్న ఈ మూడంతస్థుల ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు వరండాను, పూల కుండీలను ధ్వంసం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు. ఈ సంఘటనపై తక్షణమే దర్యాపు చేయాలని పోలీసులును ఆదేశించామని, నిందితులను త్వరలోనే అరెస్టు replica orologi audemars piguet చేస్తామని ట్వీట్‌ చేశారు.  ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.   
రాజగృహలో బీఆర్‌ అంబేద్కర్‌ తాను సేకరించిన పుస్తకాలను, సాహిత్యాన్ని పెద్దసంఖ్యలో నిల్వచేసేవారు. ప్రస్తుతం ఆ ఇంటిని అంబేద్కర్‌ వాడిన కొన్ని వ్యక్తిగత వస్తువులను ప్రదర్శించే  మ్యూజియంగా మార్చారు. అదేవిధంగా అంబేద్కర్‌పై పరిశోధనలు చేయాలకునేవారికి రాజగృహ ఒక ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నది.

 

Become a Owner