బాబా సాహేబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఇంత నిర్లక్ష్యమా? .. సామాజిక వేత్త బాబ్జీ ధ్వజం

బాబా సాహేబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఇంత నిర్లక్ష్యమా? .. సామాజిక వేత్త బాబ్జీ ధ్వజం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణలో నిర్లక్ష్యం తగదని సామాజిక వేత్త పచ్చిమల బాబ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపుడి గ్రామంలో 16 సంవత్సరాల క్రితం అంబేడ్కర్‌ విగ్రహానికి శంకుస్థాపన చేశారని... కానీ ఇప్పటి వరకు ఆవిష్కరణకు నోచుకోకపోవడం పట్ల ఆయన మండిపడ్డారు. ఇది యావత్ దళిత జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో వన్నెచింతలపూడి గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం replique montre rolex కోసం రెండు లక్షల రూపాయల గ్రాంట్‌ సెలక్షన్ అయిందని గ్రామ మాజీ సర్పంచు పరమట మోహన్‌కుమార్‌ తెలిపారు. సమయానికి నిధులు రాకపోవడంతో తన సొంత నిధులతో విగ్రహం నిర్మించానని... ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ బిల్లు ఇప్పటి వరకు మంజూరు కాలేదన్నారు. ఈ విషయాన్ని మంత్రి విశ్వరూప్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, పరమట భీమ మహేష్, పరమట ప్రసాద్, లక్ష్మణ్, కందికట్ల రాంబాబు పాల్గొన్నారు.

replica rolex Rolex replica

Become a Owner