సీఎం గారూ.. ఇది మీకు తగునా...?

సీఎం గారూ.. ఇది మీకు తగునా...?

ప్రపంచ మేధావి అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీరు పట్ల అంబేడ్కరిస్ట్‌, సామాజికవేత్త కత్తి పద్మారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా orologi replica ఇడుపుల పాయలో జరిగిన కార్యక్రమానికి స్వయంగా హాజరయ్యారని... కానీ విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని మాత్రం వీడియో ద్వారా ఆవిష్కరించారు.

ఇది కుల వివక్షత కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు మన ముఖ్యమంత్రి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి సమయం లేకుంటే మరొక రోజు శంఖుస్థాపన చేయవచ్చు కదా... ఇంత హడావిడిగా  వీడియో ద్వారా శంఖుస్థాపన చేయడం సరికాదన్నారు. 

 

Become a Owner