బర్దీపూర్ లో ప్రజాభిప్రాయ సేకరణకు హైకోర్టు స్టే... హర్షం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు

బర్దీపూర్ లో ప్రజాభిప్రాయ సేకరణకు హైకోర్టు స్టే... హర్షం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయబోతున్న NIMZ పరిశ్రమకు సంబంధించి భూసేకరణ కోసం బర్దిపూర్ లో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణకు హైకోర్టు స్టే విధించింది.
అధికారబలంతో దళితుల భూములను పరిశ్రమలకు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నించడంతో  రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో తమ భూములను పరిశ్రమలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐదు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు nike air max 90 uomo హైకోర్టును ఆశ్రయించడంతో జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణకు హైకోర్టు స్టే విధించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే సుమారు మూడువేల ఎకరాల భూమిని అధికారులు సేకరించగా.. మరో 10 వేల ఎకరాల భూమికోసం నేడు భూసేకరణపై ప్రజాభిప్రాయం సేకరణ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవ్వగా హైకోర్టు స్టే విధించడంతో అధికారులు వెనకడుగు వేశారు.

Become a Owner