స్వేరోస్ ఆధ్వర్యంలో బాబాసాహేబ్ విగ్రహానికి పాలాభిషేకం

స్వేరోస్ ఆధ్వర్యంలో బాబాసాహేబ్ విగ్రహానికి పాలాభిషేకం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గృహంపై దాడిని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా పరిగిలో స్వేరోస్‌ ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్‌గృహపై జరిగిన దాడి ఒక పిరికి పంద చర్యని.. ప్రతి దళిత జాతి బిడ్డల మనోభావాల మీద దెబ్బ తీసే విధంగా దాడికి పాల్పడ్డం అమానూషమని.. దీనిని దళిత సంఘాల నాయకులు ఖండించాలన్నారు.

ముందు రోజుల్లో అంబేద్కర్ భావజాలాలను, విగ్రహాలను ధ్వంసం చేయడానికి వీలు లేకుండా  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశానికి దశా, దిశ నిర్దేశం చేసిన మహోన్నతమైన వ్యక్తి నివసించిన ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తూ, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షులు లక్నపూర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు టి.వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Become a Owner