వీరిని ఆదుకోరూ... !!

వీరిని ఆదుకోరూ... !!

  ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. ఉన్నంతలో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని మృత్యు రూపంలో దురదృష్టం వెంటాడింది. ఒకరి వెంట ఒకరు మృత్యువాత పడడంతో చిన్నారులతో సహా ఆ కుటుంబం వీధిన పడింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు, కోడలు దూరమవడంతో పూటగడవడమే కష్టంగా మారిన ఆ వృద్దురాలు పిల్లలతో పస్తులుండాల్సిన దయనీయస్థితి నెలకొంది. 


 కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లె లోని ఈ హృదయవిదార గాథ అందర్నీ కలిచివేస్తుంది. మంద సదానందం, స్వప్న ల దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు ఆశ్రిత 9 తరగతి, రెండవ కూతురు స్ఫూర్తి 8 వ తరగతి చదువుతోంది. వారితో పాటు ఐదేళ్ల బాలుడు శివ కూడా ఉన్నాడు. కుటుంబ పోషణ కోసం సదానందం రోజువారీ కూలీగా, స్వప్న ఆశ కార్యకర్తగా పని చేసేవారు. ఈ ఇద్దరు పనిచేస్తేనే కుటుంబం గడిచేది.ఇంతలోనే విధి వంచించి ఆ కుటుంబం చిన్నాభిన్నం అయింది. సదానందం ఆరునెలల క్రితం మృతిచెందగా అప్పటి నుండి బెంగతో ఉన్న భార్య స్వప్న ఆరోగ్యం క్షీణీంచి ఏప్రిల్ మొదటి వారంలో  కానరాని లోకానికి వెళ్ళింది.

ఆరునెలల్లోనే వీరిద్దరూ మృతి చెందడం ఆ కుటుంభానికి తీరని వ్యధ మిగిలింది. దింతో ముగ్గురు పిల్లలు పోషణ చదువులు సాగలేని పరిస్థితి ఏర్పడింది ఉన్నగని ఒక్క కొడుకు,కోడల్ని కోల్పోయి వృద్ధురాలు,పిల్లలు దిక్కులేని వారుగా అయ్యారు.స్వప్న ఆశ కార్యకర్తగా పని చేస్తుండటంతో వృద్ధురాలు కి పెన్షన్ రాకుండా పోయింది.పిల్లలు చదువు,పోషణ కరువైంది దింతో చదువు, పోషణకు ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఆదుకోవాలని కోరుతున్నారు. fake rolex

Become a Owner