అంబేద్కర్‌ నివాసంపై దాడి చేసిన దుండగులపై నిర్లక్ష్యం తగదు:  బిఎల్ఎఫ్, ఐపిబిపి

అంబేద్కర్‌ నివాసంపై దాడి చేసిన దుండగులపై నిర్లక్ష్యం తగదు: బిఎల్ఎఫ్, ఐపిబిపి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నివాసంపై దాడి చేసిన దుండగులపై కేంద్ర ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌, రాష్ట్ర కన్వీనర్‌ దండి వెంకట్‌, ప్రజాబంధు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్‌కుమార్‌లు డిమాండ్‌ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచంలో అత్యంత మేధావిగా పేరు ప్రఖ్యాతులు పొందిన డాక్టర్ అంబేద్కర్‌ పై ఆధిపత్య కుల తత్వవాదులు జ్ఞాన కేంద్రంపై దాడి దేశానికి అవమానకరమని ఆవేదన వ్యక్తంచేశారు.

రాజగృహంపై దాడికి పాల్పడిన వారిని దేశ ద్రోహం కింద అరెస్ట్‌ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో MCPIU జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా, BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు, అంబేద్కర్ యువజన జిల్లా సంఘం అధ్యక్షులు మధు తదితరులు పాల్గొన్నారు.
......................

Become a Owner