అంబేడ్కర్ రాజగృహపై దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మంద క్రిష్ణ మాదిగ

అంబేడ్కర్ రాజగృహపై దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మంద క్రిష్ణ మాదిగ

ముంబయిలో B.R అంబేడ్కర్ రాజగృహపై దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో MRPS  జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పాల్గొని.. నేటి నుంచి గ్రామీణ స్థాయి నుంచి వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య సాధనకు రాజ్యాంగాన్ని, కీర్తి ప్రతిష్టలను అందించి దేశానికి ఎనలేని సేవ చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎంతో ప్రేమతో నిర్మించుకున్న రాజగృహంను ధ్వంసం చేసిన దుండగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

c
Become a Owner