వలస కూలీల కోసం 'భారత్ శ్రామిక్' యాప్ సృష్టించిన 17ఏళ్ల యువకుడు

వలస కూలీల కోసం 'భారత్ శ్రామిక్' యాప్ సృష్టించిన 17ఏళ్ల యువకుడు


మన దేశంలో కరోనా ప్రవేశించినప్పటినుండి మనిషికీ మనిషికీ దూరం ఏర్పడింది. ఎందుకంటే కరోనా ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. ఆ భయంకరమైన మరణ భయం నుండి ప్రతిఒక్కరూ తమ్మును తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు తమ తమ స్వగ్రామాలకు వెళ్లి బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకవచ్చన్న చందంగా కాలినడకన, సైకిళ్ల మీద, మోటారు బైక్ లపై కూడా వెళ్లిన దృశ్యాలను మనం చూశాం.  అయితే వారి స్వగ్రామాల్లోనే వెళ్లి ఉండిపోయిన వలస కూలీలు తమ బ్రతుకుదెరువు కోసం మళ్లీ నగరాల బాటపట్టాల్సివుంది.

అయితే వారికి పని దొరకొచ్చూ దొరక్కపోవచ్చు... ముఖ్యంగా వలస కూలీల వెతలను  దృష్టిలో పెట్టుకోని ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన '' ఎమిటీ ఇంటర్నేషనల్ స్కూల్"లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల అక్షత్ మిట్టల్ కు మంచి ఆలోచన  తట్టింది. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాడు. ''భారత్ శ్రామిక్'' అనే పేరు మీద ఓ యాప్ ను స్వయంగా తయారు చేసి ఉచితంగా సేవలందిస్తున్నాడు.

దేశంలో ఎక్కడినుంచైనా, ఎవరైనా ఈ యాప్ లో తమ పేర్లను nike air max 1 outlet నమోదు చేసుకోవచ్చు.. వలస వెళ్లాల్సిన అవసరంలేకుండానే వారు నివాసం ఉంటున్న, రాష్ట్రాలు, ప్రాంతాల్లోనే ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇలాంటి యాప్ తయారు చేసి దేశవ్యాప్తంగా ఉన్న వలసకూలీలతోపాటు నిరుద్యోగుల మన్ననలు పొందుతున్నాడు ఈ పదిహేడేళ్ల యువకుడు అక్షత్ మిట్టల్.

 

Become a Owner