రాజగృహపై దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన

రాజగృహపై దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన

ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో,  ఎల్బీ నగర్ అంబేడ్కర్  చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం  జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన వక్త్యం చేశారు. బాబాసాహేబ్  నివాసం రాజగృహపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రాజగృహపై జరిగిన దాడి రాజ్యాంగంపై  దాడిగా ఆయన అభివర్ణించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసలైన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా డాక్టర్ అంబేడ్కర్ నివాసానికి, ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేసారు. ఇతర జాతీయ నాయకుల నివాసాలకు రక్షణ కల్పించినట్లు బాబాసాహేబ్ ఇంటికి రక్షణ ఎందుకు  ఏర్పాటు చేయలేదని ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించారు.  

 

c
Become a Owner