కబ్జాకు కాదేది అనర్హం... అంబేడ్కర్ కమిటీ హాల్ స్థలాన్నీ కాజేశాడు..!?

కబ్జాకు కాదేది అనర్హం... అంబేడ్కర్ కమిటీ హాల్ స్థలాన్నీ కాజేశాడు..!?

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం నడిపూడి అంబేద్కర్ నగర్‌లో ఆక్రమణకు గురైన అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాల్‌ స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతూ అమలాపురం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. 1970లో అంబేద్కర్ నగర్‌లోని దళితపేటలో అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం  సర్వే నెంబర్ 23లో 49 సెంట్ల భూమిని కేటాయించారు. కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ ప్రారంభం ప్రారంభం కాకపోవడంతో స్థానిక భూస్వామి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు జనవరి నెలలో అమలాపురం ఆర్డీవోకు, ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించకపోవడంతో మళ్ళీ ఆర్డీవో భవానీశంకర్‌కు వినతి పత్రం అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొరబాబు, ప్రభాకర్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

 

Become a Owner