మాస్టర్ కీ, స్నేహటీవీల ఆధ్వర్యంలో చైనా వస్తువుల బహిష్కరణ, దగ్ధం

మాస్టర్ కీ, స్నేహటీవీల ఆధ్వర్యంలో చైనా వస్తువుల బహిష్కరణ, దగ్ధం

ప్రధాని నరేంద్ర మోది పిలుపు మేరకు స్నేహ టీవీ, మాస్టర్‌ కీ టీవీల ఆధ్వర్యంలో చైనా వస్తువులను బహిష్కరణ-దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందయనీమని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి అన్నారు.  స్నేహటీవీ, మాస్టర్ కీ టీవీల ఆధ్వర్యంలో హైద్రాబాద్ లక్టికాపూల్‌లో చైనా వస్తువుల బహిష్కరణ-దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్నేహ టీవీ, మాస్టర్‌ కీ టీవీలు ఈ కార్యక్రమంతో దేశ ప్రజలకు చక్కని సందేశాన్ని ఇచ్చాయని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి అన్నారు. ప్రజలంతా చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇదే మన అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి అని ఆయన అన్నారు. చైనా వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులకు ప్రాచుర్యం కల్పించాలని మాస్టర్‌ కీ టీవీ డైరెక్టర్‌ శివనాగేశ్వర రావు గౌడ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ గ్రూప్‌ ఆఫ్‌ ఆర్గనైజేషన్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కటికల శివభాగ్యారావు, మాస్టర్ కీ టీవీ డైరెక్టర్, ఎల్జేపీ నేత భీమారావు, ఆర్మూరు జిల్లా బీజేపీ నాయకులు వినయ్ రెడ్డి పాల్గొన్నారు. 

c
Become a Owner