విషాహారం తిని 76మందికి అస్వస్థత.. విశాఖ జిల్లాలో సంఘటన

విషాహారం తిని 76మందికి అస్వస్థత.. విశాఖ జిల్లాలో సంఘటన

విశాఖపట్టణం జిల్లాలోని జి.మాడుగుల మండలంలో విషాహారం తిని 76 మంది ఆసుపత్రి పాలయ్యారు. మండలంలోని మగతపాలెంలో జరిగిందీ ఘటన. మాంసాహారం తిన్న గ్రామస్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. స్ధానికుల సమాచారం rolex replica nederland మేరకు వెంటనే గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు 70 మంది బాధితులను మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఆరుగురిని పాడేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొంతమంది పిల్లల పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్యసిబ్బంది, అధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులను పాడేరు స్థానిక ఎమ్మెల్యే  భాగ్యలక్ష్మి పరామర్శించారు.

 

c
Become a Owner