విశాఖ మన్యంలో విస్తారంగా వర్షాలు... జలదిగ్బంధంలో నివాసాలు

విశాఖ మన్యంలో విస్తారంగా వర్షాలు... జలదిగ్బంధంలో నివాసాలు

విశాఖ జిల్లా పాడేరు మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మండల కేంద్రమైన హుకుంపేటలో గల సాయి బాబా టెంపుల్, సిపిఎం కాలనీ జలమయం అయ్యాయి. దీంతో డ్రైనేజీ సదుపాయం సక్రమంగా లేకపోవడంతో స్థానికంగా నివాసం ఉంటున్న zapatillas nike baratas ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవేశించి.. నిల్వ ఉంచుకునే ధాన్యంతో సహా సమస్తం జలమయం అయ్యాయి. దీంతో బాధితులు సమీపంలో ఉంటున్న మీడియా ప్రతినిధి సంప్రదించగా.. అక్కడి దృశ్యాలను కెమెరాలో బంధించి హుకుంపేట ఎంపీడీవో ఇమ్మానియేల్ ను ఫోన్లో సంప్రదించారు. దీంతో స్పందించిన ఎంపీడీవో తక్షణమే డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పరిచే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. అధికారులు 2 సంవత్సరాల క్రితం డ్రైనేజ్ నిర్మించినప్పటికి కొంతమంది తమ స్వార్థాల కోసం ఇల్లు నిర్మించుకునేందుకు డ్రైనేజీలు మూసివేశారని బాధితులు ఆరోపించారు.

Become a Owner