'ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రాజగృహపై దాడి'

'ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రాజగృహపై దాడి'

ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే నేడు రాజగృహపై దాడి జరిగిందని షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు సుదర్శన్‌ బాబు అన్నారు. సంఘం హైదరాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ బన్సిలాల్‌పేట జబ్బార్‌ బిల్డింగ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌, బాబు జగ్గీవన్‌ రామ్‌ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ నివసించిన రాజగృహపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి రాజ్యాంగపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు. రాజగృహపై దాడి రాజ్యంగంపై  జరిగిన దాడిగా అభివర్ణించారు. 
రాజగృహపై దాడిని నిరసిస్తూ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ అధ్యక్షులు రాగాల నాగేశ్వర్ రావు తెలియజేశారు. సంఘం హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దర్గా కరుణాకర్, డి. శంకర్,బండి శ్రీను, శివుడు , శ్రీహరి, ప్రకాష్, సాయిరామ్, జి. నరేష్, అశోక్ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజగృహపై దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు.

Become a Owner